Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కొవ్వూరుపాడులో ఉత్సాహభరిత వాతావరణం: గ్రామపెద్దల మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన వేగివాడ రామాదేవి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొవ్వూరుపాడులో ఉత్సాహభరిత వాతావరణం: గ్రామపెద్దల మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన వేగివాడ రామాదేవి

వార్త ముఖ్యాంశాలు

  • కొవ్వూరుపాడులో ఉత్సాహభరిత వాతావరణం: గ్రామపెద్దల మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన వేగివాడ రామాదేవి తూర్పు గోదావరి జిల్లా నవంబర్ 20 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల , గోపాలపురం మండలం, కొవ్వూరుపాడు గ్రామంలో స్థానిక ఎన్నికల వేడిలో రాజకీయ సందడి నెలకొంది.
  • కొవ్వూరుపాడు గ్రామపెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించిన అభ్యర్థిగా వేగివాడ రామాదేవి తన నామినేషన్ పత్రాలను ఘనంగా దాఖలు చేశారు.
  • ఈ సందర్భంగా వేగివాడ రవికుమార్ రవి వేగివాడ బ్రదర్స్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

కొవ్వూరుపాడులో ఉత్సాహభరిత వాతావరణం: గ్రామపెద్దల మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన వేగివాడ రామాదేవి

తూర్పు గోదావరి జిల్లా నవంబర్ 20

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల , గోపాలపురం మండలం, కొవ్వూరుపాడు గ్రామంలో స్థానిక ఎన్నికల వేడిలో రాజకీయ సందడి నెలకొంది. కొవ్వూరుపాడు గ్రామపెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించిన అభ్యర్థిగా వేగివాడ రామాదేవి తన నామినేషన్ పత్రాలను ఘనంగా దాఖలు చేశారు.
ఈ సందర్భంగా వేగివాడ రవికుమార్ రవి వేగివాడ బ్రదర్స్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అట్టహాసంగా సాగిన ఈ ర్యాలీతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వేగివాడ రవి స్వయంగా తన తల్లి రామాదేవి ని వెంటబెట్టుకుని వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు.
వేగివాడ రవికుమార్ స్పందన:
నామినేషన్ దాఖలు అనంతరం వేగివాడ రవికుమార్ మాట్లాడుతూ.. “కొవ్వూరుపాడు గ్రామపెద్దల ఆశీస్సులు, సంపూర్ణ సహకారంతోనే నా తల్లి తో నామినేషన్ వేయించాను. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు తెలపాలి. నా తల్లి కి అఖండ విజయాన్ని ప్రసాదించాలని గ్రామస్తులను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, స్థానిక నాయకులు, యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రామాదేవి కి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *