Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో లీగల్ అంశాలపై శిక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో లీగల్ అంశాలపై శిక్షణ

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు : నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం మెడికో లీగల్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా వైద్య నిపుణులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.మెడికో లీగల్ కేసులను సమర్థవంతంగా నిర్వహించే విధానం, సంఘటనలకు సంబంధించిన ఆధారాల సేకరణ, పోస్టుమార్టం ప్రక్రియ, వైద్యులు అనుసరించాల్సిన చట్టపరమైన నిబంధనలు, బాధ్యతల గురించి వివరించారు.
  • ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వైద్యులకు వృత్తిపరమైన అవగాహన పెంపొందించడంతో పాటు చట్టపరమైన అంశాలపై స్పష్టతనిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్, డాక్టర్ పవన్, డాక్టర్ ధర్మతేజ,…

నెల్లూరు : నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం మెడికో లీగల్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.మెడికో లీగల్ కేసులను సమర్థవంతంగా నిర్వహించే విధానం, సంఘటనలకు సంబంధించిన ఆధారాల సేకరణ, పోస్టుమార్టం ప్రక్రియ, వైద్యులు అనుసరించాల్సిన చట్టపరమైన నిబంధనలు, బాధ్యతల గురించి వివరించారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వైద్యులకు వృత్తిపరమైన అవగాహన పెంపొందించడంతో పాటు చట్టపరమైన అంశాలపై స్పష్టతనిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్, డాక్టర్ పవన్, డాక్టర్ ధర్మతేజ, సీనియర్ రెసిడెంట్లు, పీజీ వైద్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *