Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమల, నవంబరు 18 (పున్నమి): తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
  • ఈ పది రోజుల పాటు సుమారు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
  • తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుమల, నవంబరు 18 (పున్నమి): తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ పది రోజుల పాటు సుమారు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి రెండు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *