Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జీజీహెచ్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు జీజీహెచ్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు

వార్త ముఖ్యాంశాలు

  • ఆధునిక వైద్య సదుపాయాలతో అత్యవసర రోగులకు మెరుగైన సేవలు నెల్లూరు, నవంబర్ (పున్నమి): నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో అత్యవసర వైద్య సేవలకు కొత్త వసతులు అందుబాటులోకి వచ్చాయి.
  • నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనంలోకి ఎమర్జెన్సీ విభాగాన్ని మంగళవారం తరలించారు.
  • రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 50 పడకలు ఏర్పాటు చేశారు.

ఆధునిక వైద్య సదుపాయాలతో అత్యవసర రోగులకు మెరుగైన సేవలు

నెల్లూరు, నవంబర్ (పున్నమి): నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో అత్యవసర వైద్య సేవలకు కొత్త వసతులు అందుబాటులోకి వచ్చాయి. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనంలోకి ఎమర్జెన్సీ విభాగాన్ని మంగళవారం తరలించారు.

రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 50 పడకలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలు, అవసరమైన చికిత్సా సదుపాయాలతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ప్రతిరోజూ సుమారు 20 మంది అత్యవసర రోగులు ఈ విభాగానికి వస్తుండగా, రోడ్డు ప్రమాద బాధితులకు కూడా ఇక్కడ చికిత్స అందించనున్నారు.

గత సెప్టెంబర్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ఈ భవనాన్ని ప్రారంభించారు. వైద్య పరికరాల ఏర్పాటు పూర్తికావడంతో తాజాగా ఎమర్జెన్సీ సేవలను కొత్త భవనంలో ప్రారంభించారు. అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ప్రసవాలు నిర్వహించేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త భవనంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరికరాల ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడిందని ఎమర్జెన్సీ విభాగం అధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *