Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

కార్తీక సోమవారంతో శివాలయంలో భక్తజన సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక సోమవారంతో శివాలయంలో భక్తజన సందడి

వార్త ముఖ్యాంశాలు

  • కార్తీక సోమవారంతో శివాలయంలో భక్తజన సందడి లింగాభిషేకాలు, ప్రత్యేక పూజలు..
  • అయ్యప్ప, శివ స్వాముల భక్తి ప్రదర్శనలు కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 16వ తేదీ సోమవారం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
  • కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కార్తీక సోమవారంతో శివాలయంలో భక్తజన సందడి

లింగాభిషేకాలు, ప్రత్యేక పూజలు.. అయ్యప్ప, శివ స్వాముల భక్తి ప్రదర్శనలు

కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 16వ తేదీ సోమవారం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప స్వాములు, శివ స్వాములు ప్రత్యేకంగా పాల్గొని స్వామివారికి లింగాభిషేకాలు నిర్వహించి భక్తితో పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు శివుడికి అభిషేకాలు, అర్చనలు సమర్పించి, దీపారాధనలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు, శివ స్వాములు భక్తి ప్రదర్శనలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణలు, అయ్యప్ప శరణుఘోషలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో విశిష్టత ఉండటంతో భక్తులు అత్యంత నియమనిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

పున్నమి రిపోర్టర్
భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *