Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పంచాయతీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పంచాయతీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరులో ముఖ్య కార్యకర్తల సమావేశంసర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీకి ఆసక్తి ఉన్నవారికి అవకాశం ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఆత్మకూరులో నిర్వహించారు.
  • నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ బలాబలాలను అంచనా వేయడంతో పాటు, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సమావేశం జరిగింది.
  • ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు, పోటీకి అవకాశమున్న పంచాయతీలు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల వివరాలను సేకరించారు.

ఆత్మకూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం
సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీకి ఆసక్తి ఉన్నవారికి అవకాశం

ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఆత్మకూరులో నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ బలాబలాలను అంచనా వేయడంతో పాటు, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు, పోటీకి అవకాశమున్న పంచాయతీలు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల వివరాలను సేకరించారు. పార్టీకి అనుకూలమైన అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఆసక్తి కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తి అవకాశాలు కల్పిస్తుందని నాయకులు ప్రకటించారు.ఈ సమావేశానికి భారతీయ జనతా కిసాన్ మోర్చా అఖిల భారత ఉపాధ్యక్షులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, గ్రామస్థాయిలో కార్యకర్తల పాత్ర, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి హాజరైన ముఖ్య కార్యకర్తలు తమ ప్రాంతాల్లోని రాజకీయ పరిస్థితులు, పార్టీకి ఉన్న అవకాశాలు, పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల వివరాలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులు సూచించారు. ఎన్నికలకు ముందుగానే క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి, అనుకూలమైన పంచాయతీల్లో పోటీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.గ్రామస్థాయి ఎన్నికల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పిస్తూ, ఆసక్తి ఉన్నవారికి సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించే దిశగా పార్టీ ముందుకు సాగుతున్నట్లు నాయకులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *