Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రముఖ సినీ నటుడు గిరిబాబు కన్నుమూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రముఖ సినీ నటుడు గిరిబాబు కన్నుమూత

వార్త ముఖ్యాంశాలు

  • తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
  • ప్రముఖ నటుడు గిరిబాబు (80) అనారోగ్యంతో కన్నుమూశారు.
  • కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు గిరిబాబు (80) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లాలో 1946లో జన్మించిన గిరిబాబు 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సుమారు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *