Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రూ.1.55 లక్షల నగదు, విలువైన పత్రాలు పోలీసులకు అప్పగింత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.1.55 లక్షల నగదు, విలువైన పత్రాలు పోలీసులకు అప్పగింత

– బ్యాగు యజమానిని గుర్తించి నగదు, పత్రాలు తిరిగి అప్పగించిన గాజువాక పోలీసులు – వీరభద్రరావును అభినందించిన సీఐ వాసు నాయుడు

గాజువాక, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి):

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా గాజువాకకు చెందిన గోరు వీరభద్రరావు నిలిచారు. తనకు దొరికిన రూ.1,55,900 నగదుతో పాటు విలువైన పత్రాలను ఏమాత్రం ఆశపడకుండా గాజువాక పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. గాజువాక కనితి రోడ్డులో నివాసం ఉంటూ బైక్ సీట్ కవర్లు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న గోరు వీరభద్రరావు (50), శుక్రవారం ఉదయం కాలకృత్యాల నిమిత్తం వెళ్తుండగా సీఎంఆర్ సెంటర్ ఎదురుగా ఓ బ్యాగు కనిపించింది. దానిని పరిశీలించగా అందులో రూ.1,55,900 నగదుతో పాటు ముఖ్యమైన పత్రాలు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ బ్యాగును గాజువాక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

పోలీసులు బ్యాగులోని పత్రాల ఆధారంగా విచారణ చేపట్టి, అది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సాయికిషోర్‌కు చెందినదిగా గుర్తించారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి గుర్తింపు వివరాలు పరిశీలించిన తరువాత నగదుతో పాటు పత్రాలను తిరిగి అందజేశారు.

ఈ సందర్భంగా గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వాసు నాయుడు గోరు వీరభద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా నిజాయితీ, నైతిక విలువలు గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని, వీరభద్రరావు చేసిన పని సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

రూ.1.55 లక్షల నగదు, విలువైన పత్రాలు పోలీసులకు అప్పగింత

రూ.1.55 లక్షల నగదు, విలువైన పత్రాలు పోలీసులకు అప్పగింత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *