Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

రైతు ఒప్పంద పత్రం పేరుతో ప్రైవేట్ సంస్థల మాయాజాలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రైతు ఒప్పంద పత్రం పేరుతో ప్రైవేట్ సంస్థల మాయాజాలం

వార్త ముఖ్యాంశాలు

  • సమగ్ర విచారణ జరిపి రైతులకు రక్షణ కల్పించాలి చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి మండల వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేత చెన్నరావుపేట :( పున్నమి తెలుగు దినపత్రిక) రైతు ఒప్పంద పత్రం పేరుతో ప్రైవేట్ సంస్థలు మాయాజాలం చేస్తున్నాయని సమగ్ర విచారణ…
  • బుధవారం మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో ప్రైవేట్ వ్యక్తులు, కొన్ని సంస్థలు ముఖ్యంగా మిట్టి ల్యాబ్స్, ట్రాయి కన్సర్వ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి రైతు ఒప్పంద పత్రం పేరుతో అమాయక రైతుల వద్దకు వచ్చి సంతకాలు, బొటనవేలి ముద్రలు సేకరిస్తున్న వ్యవహారం పై…

సమగ్ర విచారణ జరిపి రైతులకు రక్షణ కల్పించాలి చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి మండల వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేత

చెన్నరావుపేట 🙁 పున్నమి తెలుగు దినపత్రిక)
రైతు ఒప్పంద పత్రం పేరుతో ప్రైవేట్ సంస్థలు మాయాజాలం చేస్తున్నాయని సమగ్ర విచారణ జరిపి రైతులకు రక్షణ కల్పించాలని చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్, రైతు నాయకులు తొగరు చెన్నారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో ప్రైవేట్ వ్యక్తులు, కొన్ని సంస్థలు ముఖ్యంగా మిట్టి ల్యాబ్స్, ట్రాయి కన్సర్వ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి రైతు ఒప్పంద పత్రం పేరుతో అమాయక రైతుల వద్దకు వచ్చి సంతకాలు, బొటనవేలి ముద్రలు సేకరిస్తున్న వ్యవహారం పై తక్షణమే సమగ్ర విచారణ జరపాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, వరి సాగులో నీటి ఆదా పద్ధతి, కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టుల పేరుతో గ్రామాలలో ప్రైవేట్ ఏజెన్సీలు చురుగ్గా తిరుగుతున్నాయని తెలిపారు. ఈ ఒప్పంద పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే రైతులకు తీవ్ర ముప్పు

తెచ్చే విధంగా అనేక అనుమానాస్పద నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాల ద్వారా రైతులకు ఒరిగే ప్రత్యక్ష లబ్ధి లేదా అధికారిక రాయితీల పై ఎలాంటి స్పష్టత లేదన్నారు. రైతుల భూమి వివరాలు, వ్యక్తిగత డేటా, ఫోటోలు సేకరించి వాటిపై పూర్తి హక్కులను మూడో వ్యక్తికి లేదా ఇతర వ్యాపార భాగస్వాములకు బదిలీ చేసుకునేలా నిబంధనలు రూపొందించారన్నారు. ఇది భవిష్యత్తులో డిజిటల్ లేదా భూమి హక్కులకు విఘాతం కలిగించవచ్చని అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం సాంకేతిక నిబంధనలు, కార్బన్ క్రెడిట్లపై అవగాహన లేని అమాయక రైతుల సంతకాలు సేకరించి, వారిని చట్టపరమైన చిక్కుల్లో పడవేసే కుట్ర జరుగుతోందన్నారు. మండలంలో తిరుగుతున్న సదురు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్నాయా లేదా అనే దాని పై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలన్నారు. అనుమతి లేని లేదా అనుమానాస్పద ప్రైవేట్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయవద్దని వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ప్రతి గ్రామంలో రైతులకు తక్షణమే అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. మోసపూరిత నిబంధనలతో రైతుల వద్ద సంతకాలు సేకరిస్తున్న సంస్థల పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంతకాలు చేసిన రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించి తగిన మార్గదర్శకత్వం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *