Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దీపావళి బాణసంచా ప్రభావం.. నెల్లూరులో పెరిగిన వాయు కాలుష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దీపావళి బాణసంచా ప్రభావం.. నెల్లూరులో పెరిగిన వాయు కాలుష్యం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: దీపావళి వేడుకల్లో బాణసంచా మోత మోగడంతో నెల్లూరు నగరంలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది.
  • పండుగకు ముందు సాధారణ స్థాయిలో ఉన్న కాలుష్యం, టపాసుల పొగ కారణంగా ఒక్కసారిగా పెరిగింది.
  • నవంబరు 5న నగరంలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 62గా నమోదవగా, దీపావళి రోజైన నవంబరు 8న 82కు చేరింది.

నెల్లూరు: దీపావళి వేడుకల్లో బాణసంచా మోత మోగడంతో నెల్లూరు నగరంలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది. పండుగకు ముందు సాధారణ స్థాయిలో ఉన్న కాలుష్యం, టపాసుల పొగ కారణంగా ఒక్కసారిగా పెరిగింది. నవంబరు 5న నగరంలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 62గా నమోదవగా, దీపావళి రోజైన నవంబరు 8న 82కు చేరింది. పండుగ మరుసటి రోజు నవంబరు 9న ఏకంగా 175కు పెరిగింది.నగరంలోని పినాకిని ఎవెన్యూ ప్రాంతంలో అత్యధికంగా 187 ఏక్యూఐ నమోదైంది. లక్ష్మీనగర్‌లో 181గా రికార్డయింది. ఈ గణాంకాలు గాలి నాణ్యత క్షీణించినట్లు స్పష్టం చేస్తున్నాయి.నిపుణుల ప్రకారం 101 నుంచి 200 మధ్య ఏక్యూఐ ఉంటే మధ్యస్థ కాలుష్యంగా పరిగణిస్తారు. అయినప్పటికీ ఈ పరిస్థితి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. పండుగ అనంతరం కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శ్వాస సంబంధిత సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *