Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై ఆరా తీస్తారా?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై ఆరా తీస్తారా?

వార్త ముఖ్యాంశాలు

  • --ఓట్ల వ్యత్యాసంలో సొంత పార్టీ నేతల హస్తాలు ఉన్నాయా ?
  • ---అధ్యయనం చేస్తే అసలు నిజాలు వెలుగులోకి..
  • ఈ నెల 1వ తేదీన జరిగిన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో అనేక డివిజన్లలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ సాగుతోంది.

–ఓట్ల వ్యత్యాసంలో సొంత పార్టీ నేతల హస్తాలు ఉన్నాయా ?
—అధ్యయనం చేస్తే అసలు నిజాలు వెలుగులోకి..
ఈ నెల 1వ తేదీన జరిగిన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో అనేక డివిజన్లలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ సాగుతోంది. కూటమి మేయర్ అభ్యర్థి పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ 80,177 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఆయనకు మరికొన్ని వేల ఓట్ల మెజారిటీ లభించే అవకాశాలు కూడా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సొంత కూటమి పార్టీల్లోనే జరిగిన పలు పరిణామాల వల్ల ఆయన మెజారిటీ ఆశించినదానికంటే తగ్గిందనే చర్చ జరుగుతోంది.

అనేక డివిజన్లలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రాగా, మేయర్ అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడంలోని మతలబు ఏమిటని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చి, మేయర్ అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడానికి కారణాలేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాలపై కూటమి నేతలు, ముఖ్యంగా మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ ఆరా తీసి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తం 72 డివిజన్లకుగాను రూరల్ పరిధిలోని 8 డివిజన్లు నామినేషన్ల పరిశీలన దశలోనే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 డివిజన్లలో ఎన్నికలు జరగ్గా, వీటిలో అనేక డివిజన్లలో కార్పొరేటర్, మేయర్ అభ్యర్థులకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసాలు కనిపించాయి. ఈ వ్యత్యాసాల వెనుక ఏయే శక్తులు పనిచేశాయి? పనిచేస్తే ఎంతవరకు పనిచేశాయి? ఎందుకు ఇలా వ్యవహరించాయి? అనే విషయాలపై నేతలు ఆరా తీయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

డివిజన్లవారీగా ఓట్ల లెక్కలను పరిశీలిస్తే ‘ఇంటి దొంగల బండారం బయటపడే అవకాశం ఉంది’ అని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *