ఈఓ శైలజ చొరవతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. అదనపు మోటారు అందుబాటులో ఉంచాలని స్థానికుల విజ్ఞప్తి
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు పంచాయతీలో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను నిన్న స్థానికులు పంచాయతీ ఈఓ శైలజ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టించారు.
బావి వద్ద ఉన్న కట్టలు పాడైపోవడంతో వాటి స్థానంలో కొత్త కట్టలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోటారు, పైపులను కూడా కొత్తవి మార్చి తాగునీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సాయంత్రానికి ప్రజలకు తాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్‌తో పాటు ఇతర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు మోటారు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి
భవిష్యత్తులో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మోటారు మరమ్మతులకు గురైనప్పుడు వెంటనే ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు అదనపు మోటారును స్పేర్‌గా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా 24 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్