*_కూటమికి అండగా నిలిచిన ఇబ్రహీంపట్నం ప్రజలు_*
_తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య_
_జడ్పిటిసి విజేత రెంటపల్లి వెంకటేశ్వరరావు, కొట్టికలపూడి ఎంపీటీసీ పూర్ణచంద్రరావు కు సత్కరించిన జంపాల_
ఇబ్రహీంపట్నం,
మరోసారి ఇబ్రహీంపట్నం మండల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు… చరిత్రత్మక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు మరింత స్వచ్ఛమైన పాలన అందించాలని విజేతలకు సూచించారు. ఇబ్రహీంపట్నం జడ్పిటిసిగా భారీ మెజార్టీతో విజయం సాధించిన రెంటపల్లి వెంకటేశ్వరరావు, కొటికలపూడి ఎంపిటిసి పూర్ణచంద్రరావు జంపాల సీతారామయ్య గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజేతలను శాలువాతో ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకులు వెంటరాగా జంపాలని కలిశారు. పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాపాడాలని… ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రజలకు అండగా నిలవాలని కోరారు

