హృదయపూర్వక
రెడ్డిగూడెం మూడో ఎంపీటీసీ సెగ్మెంట్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు!
ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నాకు మీ అమూల్యమైన ఓటు వేసి, 138 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ విజయం నాది మాత్రమే కాదు… నన్ను నమ్మి, నా వెంట నిలబడి, నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తది, ప్రతి నాయకుడిది, ప్రతి ఒక్క అభిమాని ది, ముఖ్యంగా నాపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్క ప్రజానీకానిది.
మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, మన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.
మీ నమ్మకమే నా బలం… మీ ఆశీర్వాదమే నా విజయం… మీ సేవే నా లక్ష్యం!
నాకు ఓటు వేసినవారికి, ఓటు వేయలేకపోయినవారికి కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితమవుతాను.
మరొక్కసారి నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ నరెడ్ల సీతాకుమారి
ఎంపీటీసీ విజేత – రెడ్డిగూడెం మూడో సెగ్మెంట్
కూటమి అభ్యర్థి 🙏

