వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల స్థాయిలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపు దిశగా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని కనిగిరి ఓట్ల లెక్కింపు కేంద్ర సమాచారం..టీడీపీ పార్టీకి వ్యవస్థాగత ఓటుబ్యాంక్, గెలుపుకు పాత్ర…
- అటు పక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి అంబటి కొండారెడ్డి సతీమణి పోటీలో వున్న విషయం అందరికి తెలుసు..
- కనిగిరిలోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చిన, ఒంగోలు యం.
పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల స్థాయిలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపు దిశగా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని కనిగిరి ఓట్ల లెక్కింపు కేంద్ర సమాచారం..టీడీపీ పార్టీకి వ్యవస్థాగత ఓటుబ్యాంక్, గెలుపుకు పాత్ర వహిస్తుందని రాజకీయ పండితుల అభిప్రాయం.. అటు పక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి అంబటి కొండారెడ్డి సతీమణి పోటీలో వున్న విషయం అందరికి తెలుసు.. కనిగిరిలోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చిన, ఒంగోలు యం. పి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ,, టీడీపీ పార్టీ అమలు చేసిన ప్రజా ప్రయోజన పధకాలకు ఓటరు ఆకర్షితుడై జాహ్నవి రెడ్డిని అత్యంత భారీ మెజారిటీ తో గెలిపించుకుంటారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో,మాజీ ఉపసర్పంచ్ యాదాల సాయి,బీసీ సెల్ అధ్యక్షులు ఓగురు ఏడుకొండలు,,సోమిశెట్టి శ్రీనివాసులు, 5 వ ఎంపీటీసీ గా గెలిచిన అంచూరి వెంకట్ రెడ్డి,చల్లా సుబ్బారావు,, సోమిశెట్టి నారాయణ,, మరియు టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..