Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ధరణి పోర్టల్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ధరణి పోర్టల్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు!

వార్త ముఖ్యాంశాలు

  • --తెలంగాణలో పలుచోట్ల సోదాలు..
  • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, టెర్రాసిస్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
  • రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందాలు ధరణి వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

–తెలంగాణలో పలుచోట్ల సోదాలు.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, టెర్రాసిస్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు
ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందాలు ధరణి వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. IL&FS Technologies Limited, TerraCIS Technologies Limited సంస్థల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ లావాదేవీలు, సాంకేతిక నిర్వహణ, డేటా భద్రత, సంబంధిత రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆరోపణలపై అధికారిక విచారణలో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *