వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: కౌంటింగ్ నేపథ్యంలో ఉదయగిరి–సీతారామపురం పాత రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు.
- కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లకు మాత్రమే ఈ మార్గంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
- ఇతరులకు ఈ రహదారిపై ప్రవేశం లేదని తెలిపారు.
ఉదయగిరి: కౌంటింగ్ నేపథ్యంలో ఉదయగిరి–సీతారామపురం పాత రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లకు మాత్రమే ఈ మార్గంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులకు ఈ రహదారిపై ప్రవేశం లేదని తెలిపారు. సీతారామపురం వెళ్లే వారు, అక్కడి నుంచి ఉదయగిరికి వచ్చే వాహనదారులు 167-బీజీ జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.