పామూరు, నవంబర్ 6( పున్నమి న్యూస్ ప్రతినిధి ) స్థానిక పామూరు పట్టణ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ లకు కేటాంచడంతో, పోటీలో వుండే ఆశవహుళ సంఖ్య రోజు, రోజు పెరుగుతున్న సంకెతాలు. పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికోసం పోటీలో వున్న ప్రతి ఒక్కరు రాజకీయ చదరంగం పావులే,, అంటే రాజకీయం నడపడంలో రాటు తేలినవాళ్ళే అని పామూరు పుర ప్రజల అభిప్రాయం.. ఎవరి అభిప్రాయం ఎలా వున్న బరిలో వుండే ప్రతి ఒక నాయకుడు అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూపు.. స్థానికుడు, విద్యావంతుడైనా m80 భాయ్ కు, మాజీ సర్పంచ్ యాదాల సాయితో వున్న సంబంధం,, సాయి కి నమ్మినబంటుగా వుండే మంచి తనం m80 భాయ్ కు కలిసొచ్చే ప్రధాన అంశాలు.. మాజి వార్డు మెంబెర్ గా 5 సంవత్సరాలు ప్రజల మధ్య వున్న వ్యక్తిగా, తన వార్డు పరిధిలో చేసిన సేవా కార్యక్రమాలు ప్రధాన ఎజెండాగా ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతా అని, m80 భాయ్ పత్రికా విలేఖరుల చర్చాగోష్టిలో వివరించారు..






