Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ఆశీస్సులు, ఆదేశాలతో సర్పంచ్ రేస్ లో వుంటా!!!ఓగురు ఏడుకొండలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ఆశీస్సులు, ఆదేశాలతో సర్పంచ్ రేస్ లో వుంటా!!!ఓగురు ఏడుకొండలు

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారి ఆశీస్సులతో గారి పామూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పామూరు ప్రజలతో సత్సంబంధాలు, సేవాభావంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఓగూరు ఏడుకొండలు పేరు పామూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది.
  • కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులు, ప్రోత్సాహంతో ఏడుకొండలు రాజకీయంగా ముందడుగు వేయనున్నారనే చర్చ స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
  • పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండటం, ఆప్యాయంగా పలకరించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఓగూరు ఏడుకొండల ప్రత్యేకతగా స్థానికులు చెబుతున్నారు.

కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారి ఆశీస్సులతో గారి పామూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పామూరు ప్రజలతో సత్సంబంధాలు, సేవాభావంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఓగూరు ఏడుకొండలు పేరు పామూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులు, ప్రోత్సాహంతో ఏడుకొండలు రాజకీయంగా ముందడుగు వేయనున్నారనే చర్చ స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండటం, ఆప్యాయంగా పలకరించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఓగూరు ఏడుకొండల ప్రత్యేకతగా స్థానికులు చెబుతున్నారు. వ్యక్తిగత పరిచయాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించే ఆయన స్వభావం పామూరులో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడుకొండల కుటుంబానికి ప్రజాసేవలో ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఓగూరి వెంకటేశ్వర్లు ఆశీస్సులతో ఏడుకొండలు మూడుసార్లు వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. అలాగే ఆయన భార్య పాఠశాల చైర్మన్‌గా పనిచేశారు. ఆర్యవైశ్య, కాపు, రెడ్డి వర్గాలతో పాటు బీసీ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులతోనూ ఏడుకొండలుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పామూరు పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధిలైట్లు, ట్రాఫిక్ వంటి సమస్యలపై అవగాహన కలిగి ఉండటం ఆయనకు ఉన్న మరో ప్రత్యేకతగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులు, ప్రోత్సాహంతో ఏడుకొండలు పామూరు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చే అంశం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆశీస్సులతో ఆయన రాజకీయ ప్రస్థానం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి స్థానికంగా నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *