ఉదయగిరి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ సూచించారు. ఏడు రోజుల బ్రిక్స్ సుస్థిర జీవనశైలి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇష్టానుసారంగా పారవేయడం వల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి కలిగే ప్రమాదాలను వివరించారు. అవసరానికి మించి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయకుండా, వాటిని తిరిగి వినియోగించడం, రీసైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ-వ్యర్థాలను బాధ్యతాయుతంగా పారవేస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.
