వార్త ముఖ్యాంశాలు
- గేటు లేకుండా కుక్కల సంచారం..
- కిటికీలు లేని తరగతి గదులు..
- అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
గేటు లేకుండా కుక్కల సంచారం.. కిటికీలు లేని తరగతి గదులు.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పాఠశాలకు గేటు లేకపోవడంతో కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని తరగతి గదులకు కిటికీలు లేకపోవడం, భవనం బూజుపట్టి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ, డీఈఓ అధికారులు తక్షణమే పాఠశాలను సందర్శించి గేటు ఏర్పాటు చేయడంతో పాటు కిటికీలు, మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.