Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఎల్లబోయిన నర్సయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన రామస్వామి నాయక్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎల్లబోయిన నర్సయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన రామస్వామి నాయక్.

ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన ఎల్లబోయిన నర్సయ్య గారి దశదిన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉమ్మడి జిల్లా ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ హాజరై నర్సయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ సహాయం ఉపేందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు పిన్నపురెడ్డి తిరుపతిరెడ్డి, ఎస్కే మౌలానా, తీగల యాదగిరిరావు, దబ్బీర్‌పేట ఉప సర్పంచ్ రవీందర్ రావు,బుధరావుపేట మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్, అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్చ యాదగిరిరావు, వార్డు సభ్యులు ముద్దంగుల సంపత్, మాజీ వార్డు సభ్యులు గోవింద రాంబాబు, ఊడుగుల రాజు యాదవ్, అంగిరేకుల నాగరాజ్, కోలా శ్రీకాంత్, ముంజల శ్రీనివాస్, ఎస్కే జమాల్, కుమార్ యాదవ్, బూడిద శ్రీనివాస్ తదితరులు పాల్గొని నర్సయ్య గారికి నివాళులర్పించారు.

అలాగే స్థానిక గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లబోయిన నర్సయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన రామస్వామి నాయక్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *