Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరిలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోలింగ్: మండలంలో 72.53 శాతం ఓటింగ్ నమోదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కలిగిరిలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోలింగ్: మండలంలో 72.53 శాతం ఓటింగ్ నమోదు

కలిగిరి, పున్నమి ప్రతినిధి నవంబర్ 5 : మండలవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో సైతం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతమైంది. కలిగిరి మండల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 38,173 కాగా, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 27,686 ఓట్లు పోలయ్యాయి. దీనితో మండలంలో తుది ఓటింగ్ శాతం 72.53 శాతంగా నమోదైంది. పోలైన ఓట్లలో పురుషులు, మహిళల వివరాలు ఇలా ఉన్నాయి పురుషులు: 13,711 మంది, స్త్రీలు: 13,975 మంది, మొత్తం పోలైన ఓట్లు: 27,686, మొత్తం పోలింగ్ శాతం: 72.53% పురుషుల కంటే మహిళలే అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ ఎన్నికల్లో విశేషం. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచింది. నియోజకవర్గ అధికారులు, ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, కఠిన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈ నెల 7వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కలిగిరిలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోలింగ్: మండలంలో 72.53 శాతం ఓటింగ్ నమోదు

కలిగిరిలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోలింగ్: మండలంలో 72.53 శాతం ఓటింగ్ నమోదు

కలిగిరిలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోలింగ్: మండలంలో 72.53 శాతం ఓటింగ్ నమోదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *