వార్త ముఖ్యాంశాలు
- మహిమలూరులో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు మహిమలూరు: మహిమలూరు పంచాయతీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి.
- ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు వేశారు.వృద్ధులు, గర్భిణీ మహిళలకు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి సహకరించారు.
మహిమలూరులో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
మహిమలూరు: మహిమలూరు పంచాయతీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు వేశారు.వృద్ధులు, గర్భిణీ మహిళలకు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి సహకరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు.