వార్త ముఖ్యాంశాలు
- *ప్రకాశం జిల్లా తేదీ: 04.11.2026* *ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ బందోబస్తులో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.
- హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు.* నవంబర్ 5వ తేదీన జరగనున్న ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.
- హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ఆదేశించారు.
*ప్రకాశం జిల్లా తేదీ: 04.11.2026*
*ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ బందోబస్తులో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు.*
నవంబర్ 5వ తేదీన జరగనున్న ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం నుండి విధులకు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు పోలీసు సిబ్బందికి పలు సూచనలు ఒక ప్రకటనలో తెలియజేశారు
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు క్రమపద్ధతిలో క్యూ లైన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా చూడాలని, క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు ఎలాంటి తోపులాటలు, గందరగోళం తలెత్తకుండా చూడాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిని గుర్తిస్తూ సున్నపు గీతలు వేయించాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారిని మినహాయించి ఇతర వ్యక్తులు ఎవరూ 100 మీటర్ల పరిధిలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా చేరడం, అనధికారిక సమావేశాలు నిర్వహించడం వంటివి నిషేధమని, BNSS సెక్షన్ 163 (144 సెక్షన్) మరియు పోలీస్ యాక్ట్ 30 నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రాజకీయ పార్టీల గుర్తులు, కండువాలు ధరించడం, సంజ్ఞలు చేయడం లేదా ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా చేరడం, అనధికారిక సమావేశాలు నిర్వహించడం వంటి వాటికి అనుమతించరాదన్నారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించాలని, ఎన్నికల సంఘం నిషేధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా చూడాలన్నారు.
పోలింగ్ అధికారి కోరినప్పుడు మాత్రమే పోలీసు సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లాలని, అంతవరకు కేంద్రం వెలుపలే ఉండి తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రతి పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా విజిల్ను తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవాలని, క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడంలో విజిల్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేలా ప్రత్యేక బలగాలు, మొబైల్ పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న నేపథ్యంలో, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎలాంటి అవాంతరాలు లేకుండా పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూములకు తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ప్రతి ఒక్కరూ అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి తెలియజేశారు.