Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.

వార్త ముఖ్యాంశాలు

  • _*తెలంగాణలో శాంతిభద్రతలు కరువు..*_ _*మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేసి పది రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్*_ _*తెలంగాణ భవన్ | హైదరాబాద్ | 04-11-2026*_ _హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో *మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్…
  • బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం_ _మహిళలు, ఆడపిల్లలకు తల్లిదండ్రులు పక్కన ఉన్నా లేకపోయినా ప్రభుత్వమే రక్షణ కవచంగా ఉండేలా చర్యలు చేపట్టాం.
  • మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం.

_*తెలంగాణలో శాంతిభద్రతలు కరువు..*_

_*మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేసి పది రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్*_

_*తెలంగాణ భవన్ | హైదరాబాద్ | 04-11-2026*_

_హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో *మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు_

_ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం_

_మహిళలు, ఆడపిల్లలకు తల్లిదండ్రులు పక్కన ఉన్నా లేకపోయినా ప్రభుత్వమే రక్షణ కవచంగా ఉండేలా చర్యలు చేపట్టాం. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో శాంతి లేదు.. భద్రత లేదు.. మహిళలకు రక్షణ లేదు. మహిళలపై వేధింపులు, దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు_

_ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదు_

_హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్ తనపై జరుగుతున్న వేధింపులు, ఇబ్బందులపై పది రోజుల క్రితమే ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గవర్నర్‌కు కూడా అధికారిక ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించారు, అయినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, విచారణ కమిటీ ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం_

_ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళా ప్రొఫెసర్, రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె అయి ఉండి, అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోతే.. మారుమూల గ్రామాల్లో నివసించే పేద మహిళలు, దళిత మహిళలు, గిరిజన మహిళల పరిస్థితి ఏమిటి? వారు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోంది? మహిళల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడుంది?_
_సదరు మహిళా ప్రొఫెసర్ తనకు ఎదురైన వేధింపులపై విశ్వవిద్యాలయంలోని ఉన్నతాధికారులకు గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కరించకుండా ఆమెను బదిలీ చేయడం మరింత దారుణం.తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆమె పోలీసులను ఆశ్రయించారు. కానీ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి_

_విశ్వవిద్యాలయం అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయం. అలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలోనే మహిళా ఉద్యోగులకు భద్రత లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి?_
_ఈ ఘటనలో మరికొందరు కూడా బాధితులుగా ఉన్నారని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి_
_ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం_

_1 బాధిత మహిళా ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి_

_2 ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి_

_3 విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీని బాధ్యతల నుంచి తప్పించి, బాధితురాలిపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలి_

_4 బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలి_

_5 విచారణలో నేరం రుజువైతే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి_

_వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల కేటాయింపుల విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, గతంలో వంద ఎకరాల భూమి ఇతర అవసరాలకు కేటాయించగా, మరో వంద ఎకరాల భూమిని కూడా హెచ్ఎండీఏకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ వ్యవహారాలకు, ప్రస్తుత వివాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలపై కూడా సమగ్రంగా పరిశీలించాలి. విశ్వవిద్యాలయాల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదు_
_కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చింది. మహిళలను మహాలక్ష్ములుగా,_ _మహారాణులుగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు మహిళలకు కనీసం భద్రత కల్పించలేకపోతున్నారు_ _మహిళలకు కొత్త హామీలు, ఆర్థిక ప్రయోజనాల కంటే ముందుగా వారికి ఉన్న హక్కులను కాపాడాలి,_ _ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూడాలి_
_మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రోజురోజుకూ బయటపడుతోంది_

_రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించడం లేదు_

*_ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకు న్యాయం జరగకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనం_*

_బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం బాధితురాలికి అండగా ఉంటుంది. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. మహిళలను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి_

_బాధితురాలికి న్యాయం చేయకుండా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే సహించేది లేదు_

_మహిళలకు కావాల్సింది కొత్త హామీలు కాదు.. భద్రత, గౌరవం, న్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధితురాలికి న్యాయం చేయాలి. లేదంటే మహిళల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం అన్నారు సత్యవతి రాథోడ్ గారు_

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *