Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం,కూటమి మోసాలపై తిరగబడదాం!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం,కూటమి మోసాలపై తిరగబడదాం!!!

#VoteForFan

*​కూటమి మోసాలపై తిరగబడదాం.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేద్దాం!*

*​వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించండి: డాక్టర్ దద్దాల పిలుపు*

కనిగిరి మండలం గురువాజిపేటలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం

*చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి,అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిందని వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు ధ్వజమెత్తారు.* కనిగిరి రూరల్ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా మండల పార్టీ అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి గారి అధ్యక్షతన మంగళవారం మండల పరిధిలోని గురువాజిపేట పంచాయతీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలతో కలిసి వీధివీధినా పర్యటించిన ఆయనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.​ఈ సందర్భంగా ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా ఇంటి గడపకే చేరాయని గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా ప్రతి పేదవాడి కళ్లల్లో జగనన్న వెలుగులు నింపారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ పేదల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.​కూటమి అన్యాయాలను ఎదిరించాలన్నా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే గొంతును గెలిపించాలన్నా వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 5 వతేదీ జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ ఏకమై ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి, మన అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ ను అఖండ మెజారిటీ తో గెలిపించాలని దద్దాల నారాయణ యాదవ్ గారు పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో కనిగిరి రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తో పాటు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం,కూటమి మోసాలపై తిరగబడదాం!!!

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం,కూటమి మోసాలపై తిరగబడదాం!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *