వార్త ముఖ్యాంశాలు
- జిల్లా పోలీసు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా: 02.11.2026 *డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి* *మాదకద్రవ్య రహిత సమాజం కోసం 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన విజయలక్ష్మిని అభినందించిన జిల్లా ఎస్పీ డా.
- శబరీష్, ఐపీఎస్* మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ఇందుకూరి విజయలక్ష్మి (62) సోమవారం మహబూబాబాద్ జిల్లా మీదుగా ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో జిల్లా ఎస్పీ డా.
- శబరీష్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా పోలీసు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా: 02.11.2026
*డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి*
*మాదకద్రవ్య రహిత సమాజం కోసం 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన విజయలక్ష్మిని అభినందించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్*
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ఇందుకూరి విజయలక్ష్మి (62) సోమవారం మహబూబాబాద్ జిల్లా మీదుగా ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీ విజయలక్ష్మి చేపట్టిన సాహసోపేతమైన అవగాహన యాత్రను అభినందించారు. 62 ఏళ్ల వయస్సులోనూ సమాజ శ్రేయస్సు కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు, యువతకు వివరించి, వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.
మహబూబాబాద్‌లోని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు
ఈ యాత్ర సందర్భంగా మహబూబాబాద్ టౌన్‌లో డీఎస్పీ తిరుపతిరావు, ఎస్సై అరుణ్, మరియు సూరయ్యల మార్గదర్శకత్వంలో పలు స్థానిక కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలను విజయలక్ష్మి నిర్వహించారు.
లక్ష మంది విద్యార్థులకు అవగాహన
‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ఒక లక్ష మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో విజయలక్ష్మి ఈ సైకిల్ యాత్రను చేపట్టారు. అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ముగియనుంది.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. విజయలక్ష్మి చేపట్టిన ఈ అవగాహన యాత్ర మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్