వార్త ముఖ్యాంశాలు
- తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
- నందన్ సూచించారు.
- సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ముందస్తు చర్యలను వివరించారు.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సూచించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ముందస్తు చర్యలను వివరించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని తెలిపారు. నగరంలో 25 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించామని, అవసరమైతే ప్రజలను తరలించి అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. శిథిలావస్థలోని ఇళ్లు, కూలిపోయే గోడలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగుల సమీపంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని సమన్వయంతో పనిచేసేలా సిద్ధం చేశామని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర సహాయం కోసం నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్‌లైన్ నంబర్లు 0861-2356777, 1800 425 1113ను సంప్రదించాలని సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్