Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం!
  • ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు 28 వార్డులు..
  • 30 పోలింగ్ కేంద్రాలు..

ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం!

ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు

28 వార్డులు.. 30 పోలింగ్ కేంద్రాలు.. 26,529 మంది ఓటర్లు

ఆత్మకూరు, నవంబర్ 1 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పట్టణంలో వాతావరణం చల్లగా ఉండటంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 26,529 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు కేంద్రాలకు చేరుకుని ఓటు వేస్తున్నారు.ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 260 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గంగాధర్ తెలిపారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వారు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *