Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
  • ఎన్నికల నిర్వహణకు అవసరమైన గణాంకాలు వెల్లడయ్యాయి.
  • మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉండగా, 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

28 వార్డులు.. 30 పోలింగ్ కేంద్రాలు.. 26,529 మంది ఓటర్లు

ఎన్నికల విధుల్లో 230 మంది సిబ్బంది.. సమస్యాత్మక కేంద్రాలు లేవు

ఆత్మకూరు, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉండగా, 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 26,529 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వీరిలో 12,654 మంది పురుష ఓటర్లు, 13,875 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే 1,221 ఎక్కువగా ఉండటం విశేషం. పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలిస్తే 28 కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా గుర్తించారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ కేంద్రాలు ఏవీ లేవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎన్నికల విధుల నిర్వహణ కోసం మొత్తం 230 మంది సిబ్బందిని కేటాయించారు. ఇందులో 36 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), 36 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), 144 మంది ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు), 14 మంది మైక్రో అబ్జర్వర్లు (ఎంఓలు) ఉన్నారు.

మొత్తంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ కేంద్రాల వివరాలు సిద్ధం కావడంతో రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది. 28 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, ఓటర్ల మద్దతు కూడగట్టడంపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించే అవకాశముంది. ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *