వార్త ముఖ్యాంశాలు
- కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నేతలంతా సమన్వయంతో పనిచేయాలి.
- పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవు.
- మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత కృష్ణ ప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 31/10/2026.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నేతలంతా సమన్వయంతో పనిచేయాలి.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవు.
మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత కృష్ణ ప్రసాదు గారు
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 31/10/2026.
కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్థానిక నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత కృష్ణ ప్రసాదు గారు సూచించారు. వ్యక్తిగత విభేదాలు, గ్రూపులు, వర్గాలకు తావివ్వకుండా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
జి.కొండూరు మండలంలోని కవులూరు, వెలగలేరు, హెచ్. ముత్యాలంపాడు, వెల్లటూరు, కోడూరు గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు శనివారం సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ, గ్రామాల్లోని నాయకులందరూ వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నాయకులందరూ పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు పిలుపునిచ్చారు.