Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దంపూరులో కూటమి అభ్యర్థికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దంపూరులో కూటమి అభ్యర్థికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • నవంబర్ నెల 5వ తేదీన జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం దంపూరు గ్రామ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగిరిపాటి లావణ్య విజయం కోసం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపూరు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం…
  • అలాగే విడవలూరు మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌటూరు వెంకట శేషమ్మను కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
  • గత ఎన్నికల్లో తన మాట నమ్మి తనను గెలిపించారని, ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని, జరిగిన మార్పును చూసి ఓటు వేయాలని కోరారు.

నవంబర్ నెల 5వ తేదీన జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం దంపూరు గ్రామ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగిరిపాటి లావణ్య విజయం కోసం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపూరు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అలాగే విడవలూరు మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌటూరు వెంకట శేషమ్మను కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గత ఎన్నికల్లో తన మాట నమ్మి తనను గెలిపించారని, ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని, జరిగిన మార్పును చూసి ఓటు వేయాలని కోరారు. కోవూరు నియోజకవర్గానికి తాను తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారని, ఆ నమ్మకానికి న్యాయం చేయాలన్న సంకల్పంతో విడవలూరు మండల గ్రామాల అభివృద్ధికి నిరంతరం తాను కృషి చేస్తున్నానన్నారు.

ఇప్పుడు స్థానిక ఎన్నికల రూపంలో మరోసారి ప్రజలు తీర్పు చెప్పే సమయం వచ్చిందన్నారు. మీ ఇంటికి చేరిన సంక్షేమాన్ని, మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులను అమలు చేస్తున్నామన్నారు. జరుగుతున్న మార్పును ప్రజలు గుర్తించి కూటమి అభ్యర్థులకు తమ ఓటుతో మద్దతు తెలపాలన్నారు.

విడవలూరు మండల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే స్థానిక ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎమ్మెల్యేగా తాను ప్రజలకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నానని, కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నానన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ఆమె వెంట దంపూరు కూటమి ఎంపీటీసీ అభ్యర్థి నగిరిపాటి లావణ్య, విడవలూరు జడ్పీటీసీ అభ్యర్థి చౌటూరు వెంకట శేషమ్మ, దంపూరు, విడవలూరులకు చెందిన స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు ఉన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *