Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాబోవు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాబోవు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏనుగులబాయ, కొల్లదిన్నె గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఎన్నికల పట్ల అవగాహన కల్పించడంతో పాటు, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో బోగోలు మండలంలోని ఏనుగులబాయ, కొల్లదిన్నె గ్రామాల్లో కావలి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిట్రగుంట ఎస్‌ఐ డి. రామకృష్ణ, దగదర్తి ఎస్‌ఐ బి. మహేంద్ర, అల్లూరు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు గ్రామ ప్రజలకు రాబోయే ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు.

రాబోవు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

రాబోవు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

రాబోవు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *