Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దొంతి మాధవరెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దొంతి మాధవరెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
  • హనుమకొండలోని ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి నివాసంలో ఈ భేటీ జరిగింది.
  • ఈ సందర్భంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలోని ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టడం, ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే దిశగా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే, నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల కార్యాచరణను బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చర్చించినట్లు తెలిపారు.

వార్తా మూలాలు

  • Whatsupపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *