వార్త ముఖ్యాంశాలు
- ముమ్మరంగా ప్రచారం -ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం -క్రాస్ వోటింగ్ జరిగే అవకాశం -సమ్మతులు అసమ్మతుల మధ్య వోటింగ్ -కమ్యూనిస్టుల ఓట్లు ఎవరిని చేరేనో ?
- -జనసేన అసమ్మతి ఎవరికీ లాభమో ?
- నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు ఇక మిగిలింది 3 రోజులు మాత్రమే దీనితో ఆయా అభ్యర్థుల ప్రచారం నగరం లో ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికే అధికారులు పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసారు ఐతే ఈ ఎన్నికల్లో చిత్రం గా క్రాస్ వోటింగ్…
ముమ్మరంగా ప్రచారం
-ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
-క్రాస్ వోటింగ్ జరిగే అవకాశం
-సమ్మతులు అసమ్మతుల మధ్య వోటింగ్
-కమ్యూనిస్టుల ఓట్లు ఎవరిని చేరేనో ?
-జనసేన అసమ్మతి ఎవరికీ లాభమో ?
నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు ఇక మిగిలింది 3 రోజులు మాత్రమే దీనితో ఆయా అభ్యర్థుల ప్రచారం నగరం లో ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికే అధికారులు పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసారు ఐతే ఈ ఎన్నికల్లో చిత్రం గా క్రాస్ వోటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రధాన పార్టీల్లో సమ్మతులు అసమ్మతులు మధ్య వోటింగ్ జరిగే అవకాశం ఉంది కమ్యూనిస్టులు తమకు ప్రాభల్యం ఉన్న డివిజన్లల్లో కేవలం కార్పొరేటర్ అభ్యర్థులుగా మాత్రమే పోటీ చేస్తున్నారు మరి వారి ప్రధాన మేయర్ ఓట్లు ఎవరికి చేరుతాయోనన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది కార్పొరేషన్ పరిధిలో కమ్యూనిస్టుల ఓట్లు వేల సంఖ్యలో ఉన్నాయి ఇవి ఎవరికీ లాభాన్ని చేకూరుస్తాయో ఇప్పటి వరకు స్పష్టత కనిపించటం లేదు ఇక కూటమిలో ప్రధాన భాగస్వామి గా జనసేనలో అసమ్మతి కనిపిస్తుంది దీనితో ఆ పార్టీ ఓట్లలో ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు ఐతే టీడీపీ నేతలు మాత్రం అలాంటి అసమ్మతులు ఏమీ లేవని చెబుతున్నారు జనసేన నేతలు కూడా ఈ విషయం పై స్పష్టత ఇచ్చినా కింది స్థాయి క్యాడర్ లో మాత్రం అసంతృప్తి పూర్తిగా సమసిపోలేదన్న వార్తలు వినవస్తున్నాయి ఇక ప్రధాన తెలుగుదేశం పార్టీ లో కూడా అసంతృప్తి అక్కడక్కడా కాన వస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో పాత తరం టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలు పడ్డారని వారికీ ఇప్పుడు సరైన న్యాయం జరగలేదని కొందరు చెబుతున్నారు వైసీపీ నుంచి టీడీపీ కి జంప్ చేసిన సుమారు 22 మందికి ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి టికెట్ లు ఇచ్చారని వారికి పథ టీడీపీ నేతలకు మధ్య సమన్వయం కుదరలేదని పైకి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న లోన ఇప్పటికి ఎడమొఖం పెడమొఖం గానే ఉన్నారని కొందరు చెబుతున్నారు ఐనా అధికార పార్టీ గనుక వీటన్నిటిని అధిగమించి కూటమి ముందుకే వెళ్తుందని మరి కొందరు అంటున్నారు ఆర్ధిక అంగ బలాలు అధికార పార్టీకి పుష్కలంగా ఉండగా ప్రధాన ప్రతిపక్షం ఐన వైసీపీ ఈ విషయం లో కొంచెం వెనుకబడే ఉంది ఈ నేపధ్యం లో జరిగే ఎన్నికల్లో సగటు ఓటరు ఏ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతారో అన్నది ప్రధాన చర్చ గా ఉన్నదీ నెల్లూరు ఓటరు మొదటి నుంచి విలక్షణంగా వ్యవహరించే ఎన్నో సంఘటనలు ఉన్నాయి చైతన్యానికి ఆలోచనలకూ మారు పేరైనా నెల్లూరు ఓటరు నవంబర్ 1 న జరిగే పోలింగ్ లో ఏ అభ్యర్థి వైపు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఎన్నికల ఫలితాలే తేల్చాల్సిఉంది ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ ,వైసీపీ ,జనసేన ,బీజేపీ పార్టీలు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోటానికి తమ వంతు ప్రయత్నాలు అన్ని చేయటమే కాక ధనాన్ని కూడా విపరీతంగా ఖర్చుచేసినట్లు సమాచారం అలాగే అక్కడక్కడా స్వతంత్రులుగా పూర్తి చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు కుడా తమ తమ స్థాయిల్లో ప్రచారాలు ఆర్ధిక ఖర్చులు చేసి ఉన్నారు వీరు సంపాదించే ఓట్లలో మేయర్ కు సంబంధించిన ఓట్లు ఏ అభ్యర్ధికి జమ అవుతాయో కుడా తెలియని పరిస్ధితులు నెలకొనివున్నాయి.