వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
గాజువాక, అక్టోబర్ 27 (పున్నమి ప్రతినిధి):
జీవీఎంసీ 92వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కార్పొరేటర్ అభ్యర్థి పెంటకోట లీలాదేవి అన్నారు. దయాలనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రజలను కలుస్తున్నామని, తనకు మద్దతుగా ప్రజలు స్పందిస్తున్నారని తెలిపారు.
తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి
92వ వార్డులోని కొండవాలు ప్రాంతాలకు జీవీఎంసీ ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని లీలాదేవి హామీ ఇచ్చారు. డ్రైనేజీలు, కాలువలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ఫ్లూటు గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కొండవాలు ప్రాంతాలకు శాశ్వత రక్షణ
పెంటకోట శంకర్రావు మాట్లాడుతూ, వర్షాలు, తుఫానుల సమయంలో కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాల నివారణకు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రీవెన్స్ వ్యవస్థ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూ అర్హులకు సేవలు అందేలా కృషి చేస్తానని, అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. 92వ వార్డు ప్రజలు ఫ్లూటు గుర్తుపై ఓటు వేసి పెంటకోట లీలాదేవిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Uploaded Video:


