– ఎన్నికల వ్యూహాలపై నాయకులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశం*_
*మహబూబాబాద్: అక్టోబర్ 26, 2026*
_మహబూబాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారి కార్యాలయంలో నేడు మాజీ మంత్రి, వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు_
_ఈ సమావేశంలో రానున్న వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ, అర్హులైన పట్టభద్రులను గుర్తించడం, ఓటరు జాబితాలో వారి పేర్లు నమోదు అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు_
_గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, పట్టభద్రులకు ఓటు నమోదు ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా తమ పేర్లను నమోదు చేసుకునేలా నాయకులు చొరవ చూపాలని సమావేశంలో చర్చించారు_
_అలాగే నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల వారీగా ఓటర్ నమోదు పరిస్థితిని సమీక్షిస్తూ, పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయడం, నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయడం, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించుకోవడంపై ప్రధానంగా చర్చించారు_
_ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు, మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ గారు, రావుల రవిచంద్రారెడ్డి గారు, కత్తుల ఎలేందర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు_

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్