వార్త ముఖ్యాంశాలు
- 27వ వార్డు అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి ఆత్మకూరు, అక్టోబర్ 25 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో నెల్లూరుపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బలపరిచిన చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, 27వ వార్డు టీడీపీ అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మ విజయమే లక్ష్యంగా ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఇంటింటికీ వెళ్లిన టీడీపీ నాయకులు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
- ఆత్మకూరు పురపాలక సంఘంలో తమ అభ్యర్థుల విజయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు మద్దతుగా ప్రచారం
27వ వార్డు అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
ఆత్మకూరు, అక్టోబర్ 25 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో నెల్లూరుపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బలపరిచిన చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, 27వ వార్డు టీడీపీ అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మ విజయమే లక్ష్యంగా ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఇంటింటికీ వెళ్లిన టీడీపీ నాయకులు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు పురపాలక సంఘంలో తమ అభ్యర్థుల విజయానికి ప్రజలు సహకరించాలని కోరారు. చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు 27వ వార్డు అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మకు మద్దతుగా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు చెరుకూరు తిరుపతి నాయుడు పాల్గొన్నారు