Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు బజారు రోడ్ల సమస్యపై పున్నమి న్యూస్ కథనానికి స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు బజారు రోడ్ల సమస్యపై పున్నమి న్యూస్ కథనానికి స్పందన

అధికారులకు, ఎమ్మెల్యేకు, టీడీపీ నాయకులకు వ్యాపారస్తులు, స్థానిక ప్రజల కృతజ్ఞతలు

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు బజారులో రోడ్లు గుంతలమయంగా మారిన దుస్థితిపై ఈ నెల 19వ తేదీన పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన “బోగోలు బజార్లో రోడ్లు గుంతల మయం” అనే కథనానికి స్పందించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు బోగోలు బజారు వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమస్యపై స్పందించిన ఆర్‌ అండ్‌ బి డివిజనల్ ఇంజనీర్, బోగోలు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రజలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన పున్నమి న్యూస్ కథనం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బోగోలు బజారు రోడ్ల సమస్యకు పరిష్కారం లభించి, ప్రజలకు సురక్షితమైన రాకపోకలు అందుబాటులోకి రావాలని స్థానికులు ఆకాంక్షించారు.

బోగోలు బజారు రోడ్ల సమస్యపై పున్నమి న్యూస్ కథనానికి స్పందన

బోగోలు బజారు రోడ్ల సమస్యపై పున్నమి న్యూస్ కథనానికి స్పందన

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *