Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వార్త ముఖ్యాంశాలు

  • కొండాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
  • టీడీపీ ప్రధాన కార్యాలయంలో గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
  • ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

కొండాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యత, క్రమశిక్షణతో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *