Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

22వ వార్డులో వైసీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
22వ వార్డులో వైసీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్‌ 24 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున 22వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి సతీమణి శ్రీమతి ఇందుమతి, 22వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి కావాటి సుగుణమ్మకు మద్దతుగా వైసీపీ నాయకులు ఓటర్లను కలిసి ప్రచారం చేపట్టారు.
  • ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చిల్లూరు ఆదిశేషయ్య, సీనియర్‌ నాయకుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

చైర్మన్‌ అభ్యర్థి ఇందుమతి, కౌన్సిలర్‌ అభ్యర్థి సుగుణమ్మకు మద్దతుగా నేతల ప్రచారం

ఆత్మకూరు, అక్టోబర్‌ 24 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున 22వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి సతీమణి శ్రీమతి ఇందుమతి, 22వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి కావాటి సుగుణమ్మకు మద్దతుగా వైసీపీ నాయకులు ఓటర్లను కలిసి ప్రచారం చేపట్టారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చిల్లూరు ఆదిశేషయ్య, సీనియర్‌ నాయకుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యమా రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, కొండా స్వరూపారాణి, తోడేటి మణి, సమీవుల్లా, వెంగయ్య, జనార్ధన్‌, జమీర్‌, బాల అంకయ్య, షరీఫ్‌, తిరుపతయ్య, నరేష్‌, సురేష్‌, వెంకటేశ్వర్లు, పద్మ, గంగమ్మ, లక్ష్మమ్మ, బుజ్జమ్మ, సుశీలమ్మతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *