Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చివరిరోజు నామినేషన్ల జోరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చివరిరోజు నామినేషన్ల జోరు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.
  • వర్షం కురుస్తున్నా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు తరలిరావడంతో సందడి నెలకొంది.
  • ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.

ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. వర్షం కురుస్తున్నా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు తరలిరావడంతో సందడి నెలకొంది. ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయగిరిలో 10 ఎంపీటీసీ స్థానాలకు 88, వింజమూరులో 12 స్థానాలకు 100, దుత్తలూరులో 8 స్థానాలకు 51, కొండాపురంలో 11 స్థానాలకు 73 నామినేషన్లు వచ్చాయి. కావలి, కలిగిరి, వరికుంటపాడు తదితర మండలాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *