Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రశాంతంగా ముగిసిన కలిగిరి మండల ఎంపీటీసీ నామినేషన్ల పర్వం: ఉత్సాహంగా తలపడ్డ పార్టీలు,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రశాంతంగా ముగిసిన కలిగిరి మండల ఎంపీటీసీ నామినేషన్ల పర్వం: ఉత్సాహంగా తలపడ్డ పార్టీలు,

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి, అక్టోబర్ 23, పున్నమి ప్రతినిధి: కలిగిరి మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది.
  • ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
  • గత మూడు రోజులుగా (అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 23 వరకు) మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది.

కలిగిరి, అక్టోబర్ 23, పున్నమి ప్రతినిధి:
కలిగిరి మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. గత మూడు రోజులుగా (అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 23 వరకు) మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో భారీ ర్యాలీలుగా తరలివచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఈ మూడు రోజుల్లో మండల వ్యాప్తంగా ఉన్న స్థానాలకు గాను మొత్తం 76 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వైఎస్ఆర్, మండలంలో ప్రధాన పోటీ అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్, టీడీపీల మధ్యే నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. నామినేషన్ల సంఖ్య పరంగా చూస్తే ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలంలో పట్టు నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అత్యధికంగా 37 నామినేషన్లను దాఖలు చేసింది.
తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ, క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పార్టీ తరఫున 35 నామినేషన్లు దాఖలయ్యాయి. బహుజన్ సమాజ్ పార్టీ మండలంలోని కొన్ని స్థానాల్లో ఉనికిని చాటుకుంటూ 2 నామినేషన్లు దాఖలు చేసింది. జనసేన పార్టీ యువత, స్థానిక మద్దతుదారుల అండతో రంగంలోకి దిగిన జనసేన అభ్యర్థి 1 నామినేషన్ వేశారు. స్వతంత్రులు పార్టీలతో సంబంధం లేకుండా స్థానిక సమీకరణాల ఆధారంగా స్వతంత్ర అభ్యర్థి 1 నామినేషన్ దాఖలు చేశారు. కాగా, జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీలు కలిగిరి మండలంలో ఖాతా తెరవలేకపోయాయి. ఈ రెండు పార్టీల తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. మండల పరిధిలోని లక్ష్మీపురం UR – జనరల్ స్థానం – 2 నామినేషన్లు, తెల్లాపాడు UR – జనరల్ స్థానం – 4 నామినేషన్లు స్థానాలపై అన్ని పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఈ స్థానాల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *