Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హెల్త్ టిప్స్

మొదటి దశలోనే గుర్తిస్తే… రొమ్ము క్యాన్సర్‌పై విజయం ఖాయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొదటి దశలోనే గుర్తిస్తే… రొమ్ము క్యాన్సర్‌పై విజయం ఖాయం!

వార్త ముఖ్యాంశాలు

  • భారతదేశంలో మహిళలను వేధిస్తున్న ప్రాణాంతక సమస్యలలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది.
  • మన దేశంలో ఏటా దాదాపు రెండు లక్షల మంది దీని బారిన పడుతున్నారు, దాపరికం మరియు అవగాహన లోపం వల్ల వ్యాధి బాగా ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నారు.
  • 40 ఏళ్లు పైబడిన వారిలో, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారిలో, శారీరక వ్యాయామం లోపించిన వారిలో ఈ ముప్పు ఎక్కువ.

భారతదేశంలో మహిళలను వేధిస్తున్న ప్రాణాంతక సమస్యలలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో ఏటా దాదాపు రెండు లక్షల మంది దీని బారిన పడుతున్నారు, దాపరికం మరియు అవగాహన లోపం వల్ల వ్యాధి బాగా ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నారు. 40 ఏళ్లు పైబడిన వారిలో, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారిలో, శారీరక వ్యాయామం లోపించిన వారిలో ఈ ముప్పు ఎక్కువ. అయితే భయపడాల్సిన పనిలేదు; ఈ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే 95 శాతానికి పైగా పూర్తిగా నయం చేయవచ్చు.

​దీనికి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉన్న సంజీవని ‘రొమ్ము స్వీయ పరిశీలన’. సాధారణంగా చాలామంది రొమ్ముపై పుండ్లు పడటం లేదా విపరీతమైన నొప్పి వచ్చే వరకు సమస్యను గమనించరు; కానీ ప్రతినెలా స్వీయ పరీక్ష చేసుకునేవారు గడ్డ చిన్నగా ఉన్నప్పుడే, అంటే వ్యాధి ముదరడానికి కనీసం ఆరు నెలల నుండి ఏడాది ముందే పసిగట్టవచ్చు. దీనివల్ల రొమ్మును పూర్తిగా తొలగించే పనిలేకుండా చిన్న శస్త్రచికిత్సతోనే నయం చేయవచ్చు . 20 ఏళ్లు దాటిన మహిళలు ప్రతినెలా పీరియడ్స్ ముగిసిన 3 నుండి 5 రోజుల తర్వాత, అలాగే పీరియడ్స్ ఆగిపోయిన వారు ప్రతినెలా ఒక నిర్ణీత తేదీన ఇంట్లోనే ఈ సులభమైన పరీక్ష చేసుకోవాలి.

​ముందుగా అద్దం ముందు నిలబడి రొమ్ము పరిమాణం, ఆకారంలో ఏవైనా మార్పులు వచ్చాయా, చర్మంపై గుంటలు పడటం లేదా చనుమొన లోపలికి తిరగడం వంటివి ఉన్నాయేమో చూడాలి. ఆ తర్వాత పడుకుని లేదా స్నానం చేస్తూ చేతి మధ్య మూడు వేళ్ల కొనలతో రొమ్మును, చంకల భాగాన్ని గుండ్రంగా నొక్కుతూ కొత్తగా ఏవైనా గడ్డలు తగులుతున్నాయేమో స్పర్శతో పరీక్షించాలి. క్యాన్సర్ గడ్డలు ప్రారంభంలో ఎలాంటి నొప్పిని కలిగించవు కాబట్టి “నొప్పి లేదు కదా” అని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. రొమ్ములో ఏ చిన్న మార్పు కనిపించినా సంకోచాన్ని వీడి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

. డాక్టర్ ఎం.. వి. రమణయ్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *