వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరులోని వివిధ పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
- తెలుగు గంగ కాలనీ, గాంధీనగర్, వెంగళరావునగర్, డి.కె.మహిళా కళాశాల, సర్వోదయ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల తదితర ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహణకు అవసరమైన వసతులను తనిఖీ చేశారు.
- పోలింగ్ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య పనులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరులోని వివిధ పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. తెలుగు గంగ కాలనీ, గాంధీనగర్, వెంగళరావునగర్, డి.కె.మహిళా కళాశాల, సర్వోదయ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల తదితర ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహణకు అవసరమైన వసతులను తనిఖీ చేశారు. పోలింగ్ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య పనులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వెంగళరావునగర్ తాతయ్య బడి వద్ద పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. వర్షంలో విధులు నిర్వహించే సిబ్బంది రైన్కోట్లు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రఘునాథరావు, సర్వేయర్ కామేశ్వరరావు, ఏఈ ఫాజిల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.