Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి (RO) కే.
  • వెంకట్ రెడ్డి సూచించారు.
  • ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి (RO) కే. వెంకట్ రెడ్డి సూచించారు. ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల పర్యవేక్షణ, ఎన్నికల నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *