వార్త ముఖ్యాంశాలు
- నరసరావుపేట, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద వేళ అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.
- నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన యర్రం పరీణిక ద్వితి అనే చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.1,01,192 ఆర్థిక సహాయం మంజూరైంది.చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు అయ్యే ఖర్చు పేద కుటుంబానికి భారంగా…
- ఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి త్వరితగతిన రూ.1,01,192 నిధులు మంజూరయ్యాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా సహాయం అందించేందుకు ముందుంటాం.
నరసరావుపేట, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద వేళ అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన యర్రం పరీణిక ద్వితి అనే చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.1,01,192 ఆర్థిక సహాయం మంజూరైంది.చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు అయ్యే ఖర్చు పేద కుటుంబానికి భారంగా మారడంతో, బాధితుల వినతి మేరకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి త్వరితగతిన రూ.1,01,192 నిధులు మంజూరయ్యాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా సహాయం అందించేందుకు ముందుంటాం. బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా చూడటమే మా బాధ్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టే సంజీవనిలా పనిచేస్తోంది” అని తెలిపారు. చిన్నారి మెరుగైన వైద్యం కోసం పెద్ద మనసుతో స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చిన్నారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
