Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

94వ వార్డులో ధర్మాల రాధిక నామినేషన్‌ గాజువాకలో వైసీపీ విజయంపై ధర్మాల శ్రీను ధీమా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
94వ వార్డులో ధర్మాల రాధిక నామినేషన్‌ గాజువాకలో వైసీపీ విజయంపై ధర్మాల శ్రీను ధీమా

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

విశాఖపట్నం, అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి): గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా గాజువాక నియోజకవర్గంలోని పాత 64వ వార్డు, ప్రస్తుత 94వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా ధర్మాల రాధిక నామినేషన్‌ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వైసీపీ నాయకుడు ధర్మాల శ్రీను తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును కార్యకర్తల సహకారంతో విజయవంతం చేశామని పేర్కొన్నారు.

తమ సేవలను గుర్తించి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సహకారంతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆశీస్సులతో తన భార్య ధర్మాల రాధికకు 94వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు వివరించారు. గాజువాక నియోజకవర్గంలోని 22 వార్డుల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి, ఆ ఫలితాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా అందిస్తామని ధర్మాల శ్రీను ధీమా వ్యక్తం చేశారు.

Uploaded Video:

94వ వార్డులో ధర్మాల రాధిక నామినేషన్‌ గాజువాకలో వైసీపీ విజయంపై ధర్మాల శ్రీను ధీమా

94వ వార్డులో ధర్మాల రాధిక నామినేషన్‌ గాజువాకలో వైసీపీ విజయంపై ధర్మాల శ్రీను ధీమా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *