Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. కూటమి విజయానికి కాకర్ల సురేష్ దిశానిర్దేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థానిక ఎన్నికలే లక్ష్యం.. కూటమి విజయానికి కాకర్ల సురేష్ దిశానిర్దేశం

వింజమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్నాహక సమావేశం నిర్వహించారు. బొమ్మరాజుచెరువులోని క్యాంపు కార్యాలయంలో వింజమూరు మండల ముఖ్య నాయకులు, జనసేన నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. గత వైసీపీ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. కూటమి విజయానికి కాకర్ల సురేష్ దిశానిర్దేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *